COVID-19 Mask and Sanitiser distribution by I AUYSA & AVMS to Disha lady Police @Kurnool

Lyrics & Description

ఓమౌజయాః విశ్వ మహిళా సేవా సమితి, ఐఏయూవైఎస్ఏ ఆధ్వర్యంలో మాస్కులు, సానిటైజర్లు వితరణ*

* *దిశ మహిళా పోలీస్ వారి సేవలు అభినందనీయం*

కర్నూలు ఓమౌజయాః విశ్వ మహిళా సేవా సమితి మరియు యువ సేవా బృందం ఐఏయూవైఎస్ఏ ఆధ్వర్యంలో గురువారం దిశ మహిళా పోలీస్ స్టేషన్ లో మాస్కులు, సానిటైజర్లు వితరణ కార్యక్రమం జరిగింది. దిశ మహిళా పోలీస్ స్టేటన్ డి.ఎస్.పి. వెంకటరామయ్య అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ జిల్లా పరిషత్ శాఖ మ్యానేజర్ యశోద దేవి పాల్గొని, ఓమౌజయాః విశ్వ మహిళా సేవా సమితి, ఓమౌజయ యునైటెడ్ యంగ్ స్టార్స్ అసోసియేషన్ వారితో కలసి మహిళా పోలీస్ వారికి మాస్కులు, సానిటైజర్లు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఏ.వి.ఎం.ఎస్.ఎస్ సభ్యులు మాట్లాడుతూ మహిళల భద్రతే లక్ష్యంగా కరోన సమయంలోనూ విధులు నిర్వహిస్తున్న దిశ మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు మరియు సిబ్బంది సేవలను కొనియాడారు. ఏ.వి.ఎం.ఎస్ బృంద సభ్యులు కె.అనురాధ, ఎస్.శ్రీదేవి బాయి ఐఏయూవైఎస్ఏ సభ్యులు సి.ఏ ఎస్.హుస్సేన్ బాషా, డాక్టర్.కె.వి.ఎన్. శ్రావణి, ఈ.బుద్ధి రాజ్ గౌడ్, హెచ్.లోహిత్ కుమార్, ఈ.సుజిత్ గౌడ్, జక్కం భాగ్యరాజు మరియు పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.*